Malala Yousafzai Married: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్‌

10 Nov, 2021 07:47 IST|Sakshi

బ్రిటన్‌: బాలికల విద్య కోసం కృషి చేసిన ప్రచారకర్త, బాలికల విద్య కోసం ప్రచారకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. తన వివాహాన్ని బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలో తమ ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకున్నట్లు వెల్లడించింది.

(చదవండి: అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం)

అంతేకాదు తన భర్తని పేరు అస్సర్‌ అని చెప్పింది. ఈ మేరకు తన వివాహానికి సంబంధించిన ఫోటోలను మేము జీవిత భాగస్వాములమవ్వడానికి ముడివేశాం అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే మలాల పెళ్లి చేసుకున్న వ్యక్తి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకి చెందిన హైపెర్ఫార్మెన్స్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ అస్సర్‌ మాలిక్‌గా గుర్తించారు. గానీ దీని పై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.

ఈ క్రమంలో మలాల గతంలో బ్రిటన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రజలు ఎందుకు వివాహం చేసుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు మీ జీవితంలో ఒక వ్యక్తిని కలిగి ఉండాలనుకుంటే, మీరు వివాహ పత్రాలపై ఎందుకు సంతకం చేయాలి" అంటూ మాట్లాడటం గమనార్హం. 

(చదవండి: అపార్ట్‌మెంట్‌లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!)

మరిన్ని వార్తలు