2021 Nobel Prize: రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి విజేతలు వీరే..!

6 Oct, 2021 16:17 IST|Sakshi

స్టాక్‌హోం: రసాయన శాస్త్ర విభాగంలో 2021 గాను నోబెల్‌ పురస్కారాన్ని రాయల్‌ స్వీడ్‌ష్‌ అకాడమీ బుధవారం రోజున ప్రకటించింది. జర్మనీకి చెందిన బెంజమిన్‌ లిస్ట్‌, స్కాట్లాండ్‌కు  డేవిడ్ డబ్ల్యుసీ మెక్‌మిలన్‌కు రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్‌ వరించింది. ‘అసమాన ఆర్గానో కటాలిసిస్‌’ను అభివృద్ధి చేసినందుకు గాను వీరికి నోబెల్‌ పురస్కారం దక్కింది.

బెంజిమిన్‌ లిస్ట్‌, మెక్‌మిల‌న్‌ల ఆవిష్క‌ర‌ణతో ఫార్మాసూటిక‌ల్ ప‌రిశోధ‌న‌ల‌పై భారీగా ప్రభావం చూపనుంది.  విజేత‌ల‌కు 11 లక్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ దక్కనుంది. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు బెంజ‌మిన్ లిస్ట్  డైరెక్ట‌ర్‌గా పనిచేస్తున్నారు. మెక్‌మిల‌న్‌ ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు.  ఇప్ప‌టికే గత రెండు రోజుల నుంచి రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వైద్య, భౌతిక రంగాల్లో నోబెల్ పురస్కారాలను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


చదవండి: భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి విజేతలు వీరే..!

మరిన్ని వార్తలు