మళ్లీ పేలిన తుపాకీ.. ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం

14 Oct, 2022 07:53 IST|Sakshi

రాలీ‌: యూఎస్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర కరొలినాలో (North Carolina) ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. రాజధాని రాలీ Raleigh నగరంలోని న్యూస్‌ రివర్‌ గ్రీన్‌వే సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడినట్లు మేయర్‌ మేరీ బల్డవిన్‌ ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఓ టీనేజర్‌ ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు.. ఓ ఇంట్లో దాక్కున్నాడనే సమాచారంతో చుట్టుమట్టి అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. చివరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

నార్త్‌ కరొలినా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంచనా వేస్తున్నారు. మరణించినవారిలో ఒక పోలీస్‌(ఆఫ్‌ డ్యూటీలో ఉన్నారు) కూడా ఉన్నాడని పేర్కొన్నారు. గన్‌ వయొలెన్స్‌ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు(యూఎస్‌ఏ) ప్రధాన సమ్యగా మారింది. 2021 ఏడాదిలోనే 49వేల మందికిపైగా మరణించారు. ఈ లెక్కన రోజుకు సగటున 130 మంది మరణించారన్నమాట. అంటే.. ఇది ఆత్మహత్యల కేసుల కంటే బాగా ఎక్కువనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరిన్ని వార్తలు