బహిరంగంగా విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్‌ నిరంకుశపాలన

6 Dec, 2022 12:50 IST|Sakshi

ఉత్తర కొరియాలో అద్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ నిరంకుశ పాలన గురించి తెలియంది కాదు. ఆయన పాలనలో ప్రజలు తనకు నచ్చినప్పుడూ నవ్వాలి, ఏడవాలి అన్నట్లుంటుంది. ప్రతిదీ తన అదుపు ఆజ‍్క్షలో ఉండాలనే మనస్తత్వంతో... ప్రజలపై పలురకాల అర్థం కానీ ఆంక్షలు పెట్లి ఇబ్బందులకు గురిచేస్తాడు. ఇప్పుడూ అదీ కాస్తా మరోస్థాయికి చేరిందనేలా ఒక దారుణమై ఘటన వెలుగులోకి వచ్చింది.

పసివాళ్లని జాలి కూడా లేకుండా ఇద్దరు హైస్కూల్‌ విద్యార్థులకు ఉరిశిక్ష విధించి మరోసారి ప్రపంచానికి తన కర్కశత్వ పాలనను చూపించాడు. అక్టోబర్‌ ప్రాంతంలో ఆ ఇద్దరు విద్యార్థులు చైనా సరిహద్దుగా ఉన్న ఉత్తరకొరియాలోని ర్యాంగ్‌గాంగ్‌ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలోని కొంతమంది విద్యార్థులను కలుసుకున్నారు. అక్కడ వారు దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్‌ నాటక ప్రదర్శనలను వీక్షించారని సమాచారం.

దీంతో ఉత్తరకొరియా అధికారులు ఆ మైనర్‌లను ప్రజల ముందే మరణశిక్ష విధించి.. కాల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా సాంస్కృతిక సాధనాలను నియంత్రించే సైద్ధాంతిక చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు ఉత్తర కొరియాలో డ్రామాలు, సంగీతం పట్ల పెరుగుతున్న ప్రజాదరణను లక్ష్యంగా చేసుకుని విదేశీ ప్రభావం ఉండకూదని అణిచివేతలో భాగంగా నిషేధించింది. వాస్తవానికి ఉత్తరకొరియాలోకి దక్షిణ కొరియా సినిమాలను అక్రమంగా రవాణా అవ్వటమే గాక ప్రజలు ఎవరికంట పడకుండా అతి రహస్యంగా వీక్షిస్తుండటం గమనార్హం.

(చదవండి: ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్‌పోర్ట్‌ క్లోజ్‌)

మరిన్ని వార్తలు