ఆ సాహసం చేయొద్దు.. అమెరికాకు ఉత్తరకొరియా హెచ్చరిక

2 Nov, 2022 07:59 IST|Sakshi

సియోల్‌: అమెరికాతో కలిసి దక్షిణకొరియా చేస్తున్న సంయుక్త వైమానిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.  కొరియా ద్వీపకల్పంలో శాంతిభద్రతలను అమెరికా నాశనం చేస్తోందని దుయ్యబట్టింది.

దురాక్రమణకు సాహసిస్తే దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించింది. ఉత్తర కొరియా తరచూ క్షిపణి పరీక్షలు చేస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా 200 యుద్ధవిమానాలతో విన్యాసాలు చేస్తున్నాయి. 

చదవండి: (నాన్సీ పెలోసీ భర్తపై దాడి.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు)

మరిన్ని వార్తలు