Kim Jong Un Wears Mask: నార్త్‌ కొరియాలో కరోనా కలకలం.. ఫస్ట్‌ టైమ్‌ మాస్కులో కిమ్‌ జోంగ్‌ ఉన్‌

13 May, 2022 15:23 IST|Sakshi

ఉత్తరకొరియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నార్త్‌ కొరియాలో కరోనా కేసు నమోదు అయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్‌ ప్రభుత్వం తొలి కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించారు.

ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసు అని నిర్ధారణ అయిన తర్వాత నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా తొలిసారిగా కిమ్‌ జోంగ్ ఉన్‌ మాస్కు ధరించి కనపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైన  24 గంటల్లోపే ఆ రోగి చనిపోవడంతోపాటు మరో ఆరు కొత్త కేసులు వచ్చినట్లు శుక్రవారం వెల్లడైంది. దీంతో కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇక, నార్త్‌ కొరియాలో ​కోవిడ్‌ టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు టీకాలు తీసుకోలేదు. అంతకుముందు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్‌ తిరస్కరించారు. 

ఇది కూడా చదవండి: రణరంగంగా మారిన రావణ లంక.. మంత్రులకు చేదు అనుభవం

మరిన్ని వార్తలు