North Korea: ఇదేం ఆనందం కిమ్‌.. కొరియన్లు చస్తుంటే ఇలా చేశావేంటి..?

5 Jun, 2022 12:46 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉత్తర కొరియా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం బిజీగా ఉన్నారు. ఇప్పటికీ వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న సమయంలో కిమ్‌.. క్షిపణి పరీక్షల్లో మునిగిపోయారు. నార్త్‌ కొరియా ఆదివారం ఏకంగా 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. 

వివరాల ప్రకారం.. అమెరికాను హెచ్చరిస్తూ కిమ్‌ మరోసారి క్షిపణి పరీక్షలు చేశారు. రాజధాని ప్యాంగాంగ్​కు సమీపంలోని సునన్ ప్రాంతం నుంచి ఆదివారం నార్త్‌ కొరియా.. 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఒక్కరోజులో అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. 

ఇక, తాజాగా చేపట్టిన ప్రయోగాలతో నార్త్‌ కొరియా 2022లో క్షిపణి పరీక్షల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఈ పరీక్షల్లో ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు సైతం ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా అణు పరీక్షలు సైతం నిర్వహించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక‍్తమవుతున్నాయి. మరోవైపు.. ఇటీవలే అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. దీనికి కౌంటర్‌ ఇస్తూ ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: జో బైడెన్‌ ఇంటి వద్ద విమాన కలకలం.. వీడియో

మరిన్ని వార్తలు