కిమ్‌కి ఏమీ కాలేదు

27 Aug, 2020 04:51 IST|Sakshi

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కోమాలోకి వెళ్లి పోయారని వచ్చిన వదంతులకి తెర పడింది. కరోనా వ్యాప్తి, తుపాన్‌ ఎదుర్కొనే ఏర్పాట్లపై బుధవారం పొలిట్‌ బ్యూరో సమావేశంలో కిమ్‌ సమీక్ష జరుపుతున్నట్లు ఫొటోలను యంత్రాంగం విడుదల చేసింది.  అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఉన్న లోటుపాట్లను కిమ్‌ అధికారులతో చర్చించినట్టుగా అధికార వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సమావేశంలో కిమ్‌ పొగతాగుతూ కనిపించారని తెలిపింది. కిమ్‌పై అనారోగ్యం వార్తలు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ కిమ్‌ మృతి చెందారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వీడియో బయటకి వచ్చింది. ఇప్పుడు కూడా కిమ్‌ కోమాలోకి వెళ్లారని సోదరి కిమ్‌ యో జాంగ్‌కు  బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరిగింది.

మరిన్ని వార్తలు