కిమ్‌ కోమాలో లేడు, సాక్ష్యాలు చూపిన నార్త్‌ కొరియా

26 Aug, 2020 17:18 IST|Sakshi

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం  గురించి సోషల్‌మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కిమ్‌ ఆరోగ్యం బాగా క్షీణించిందని కొందరు అంటుంటే, మరి కొందరు ఏకంగా కిమ్‌ మరణించారని ప్రచారం చేస్తు‍న్నారు. ఆ మధ్య కాలంలో ఇలాంటి పుకారులు అధికం అవ్వగా కిమ్‌ ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి కిమ్‌ ఆరోగ్యానికి సంబంధించి చర్చ నడుస్తోంది. కిమ్‌ కోమాలో ఉన్నారని దక్షిణ కొరియా దౌత్యవేత్త  ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన ఇలా పేర్కొన కొద్ది రోజుల తరవాత కిమ్‌ సరికొత్త ఫోటోలను ఉత్తర కొరియా విడుదల చేసింది.  

దేశ నియంత్రణలో ఉన్న కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కిమ్ నూతన ఫోటోలను ప్రచురించింది. ఈ చిత్రాలలో కిమ్‌ వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి హాజరయినట్లు ఉంది. ఈ సమావేశంలో కరోనా వైరస్‌, ఒక తుఫాన్‌కు వ్యతిరేకంగా నియంత్రణ చర్యలు చేపట్టాలని కిమ్‌ పిలుపునిచ్చినట్లు ఆ న్యూస్‌ ఏజెన్సీ కథనాలు ప్రచురించింది. కిమ్ కోమాలో ఉన్నారని, అతని సోదరి కిమ్ యో-జోంగ్ ఉత్తర కొరియాలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దక్షిణ కొరియా దివంగత అధ్యక్షుడు కిమ్ డే-జంగ్ మాజీ సహాయకుడు చాంగ్ సాంగ్-మిన్ ఆదివారం ప్రకటించారు. కిమ్ మంచం పట్టారని, దేశాన్ని పాలించలేని స్థితిలో ఉన్నారని చాంగ్ నొక్కి చెప్పారు. తాజాగా ఉత్తర కొరియా విడుదల చేసిన ఫోటోలు నకిలివో, అసలైనవో తేలాల్సి ఉంది. 

చదవండి: కోమాలోకి కిమ్‌ జోంగ్‌ ఉన్‌!


 

>
మరిన్ని వార్తలు