ఉత్తర కొరియాలో ఆరు కరోనా మరణాలు

14 May, 2022 09:06 IST|Sakshi

సియోల్‌: ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తోంది. ‘జ్వరాలతో’ దేశంలో ఇప్పటికి ఆరుగురు చనిపోగా 3.5 లక్షల మంది ఆస్పత్రుల్లో ఉన్నారని అధికార వార్తా సంస్థ తెలిపింది. ఈ ఉధృతికి కారణాలు తెలియలేదని పేర్కొంది. అయితే ఎక్కువగా టీకా వేసుకొని వారు, పోషకాహార లోపం ఉన్న వారు కోవిడ బారిన పడుతున్నట్లు తెలిపింది.గురువారం ఒక్కరోజే 18వేల మందిలో జ్వర లక్షణాలు బయటపడ్డాయి.

మొత్తం 1,87,800 మంది ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ కరోనా కేసులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరణించిన ఆరుగురిలో ఒకరికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు. అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ గురువారం తొలిసారి మాస్క్‌ ధరించారు.

మరిన్ని వార్తలు