ఉ.కొరియాలో ‘కరోనా గోడ’

28 May, 2023 04:50 IST|Sakshi

సియోల్‌: ఉత్తర కొరియాలోకి కరోనా వైరస్‌ రాకుండా అడ్డుకోవడానికి అక్కడ కిమ్‌ ప్రభుత్వం రష్యా, చైనా సరిహద్దుల్లో ఏకంగా ఒక గోడ కట్టింది. చైనా, రష్యా సరిహద్దుల నుంచి వైరస్‌ దేశంలోకి రాకుండా ఉండాలని 2020 నుంచి కొన్ని వేల కిలోమీటర్ల మేర కంచెల్ని వేసుకుంటూ వస్తోంది. సరిహద్దుల్లో కంచెలు, గోడలు, గార్డ్‌ శిబిరాలు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది.

కరోనాకి ముందు వరకు దేశానికి ఉత్తరాన ఉన్న ఈ సరిహద్దు ప్రాంతం నుంచే చాలా మంది కిమ్‌ ప్రభుత్వం అరాచకాలు భరించలేక పారిపోయేవారు. ఆ సరిహద్దు ప్రాంతాన్ని మూసివేస్తూ ఉండడంతో అలా పారిపోయే వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. 2019లో అలా దక్షిణ కొరియాకి పారిపోయిన వారి సంఖ్య 1,047 ఉంటే గత ఏడాది వారి సంఖ్య 67కి తగ్గిపోయింది. అయితే ఈ గోడ నిర్మాణంతో చైనాతో వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం పడింది.

మరిన్ని వార్తలు