కిమ్‌కు తొలిసారి షాక్‌! ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

1 Jun, 2023 06:11 IST|Sakshi

సియోల్‌: ఉత్తర కొరి యోలో కిమ్‌ ప్రభు త్వం మిలటరీ కార్యక లాపాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరస పెట్టి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్‌ రెండో దశ సమయంలో కనెక్షన్‌ తెగిపోయినట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించింది.

ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరంవైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్‌ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్‌లు వణికిపోయాయి. రాకెట్‌ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్‌ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

మరిన్ని వార్తలు