ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. అమెరికా స్పందన ఇదే!

8 May, 2022 17:15 IST|Sakshi

సియోల్‌: జలాంతర్గామి నుంచి బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా శనివారం నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు రేవు నగరం సిన్పో సమీపంలో సముద్ర జలాల్లో ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు.

అయితే, ఏ జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేపట్టారన్న సమాచారాన్ని బహిర్గతం చేయలేదు. షార్ట్‌–రేంజ్‌ మిస్సైల్‌ను ప్రయోగించిందన్నారు. ఇది 600 కిలోమీటర్లు(373 మైళ్లు) ప్రయాణించిందని చెప్పారు. ఉత్తర కొరియా మిస్సైల్‌ పరీక్షతో తమకు గానీ, మిత్ర దేశాలకు గానీ తక్షణమే ముప్పు ఉన్నట్లు భావించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి తమ ప్రత్యేక ఆర్థిక జోన్‌ సమీపంలో సమద్రంలో కూలిపోయిందని, దానివల్ల తమ నౌకలకు, విమానాలకు నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని జపాన్‌ తెలిపింది.

చదవండి: Bali: పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగింది.. సారీ చెప్పించుకుని మరీ వెళ్లగొట్టారు

మరిన్ని వార్తలు