హాలీవుడ్‌ మూవీ మాదిరి మిస్సైల్‌ వీడియో...హీరోగా కిమ్‌ జోంగ్ ఉన్

25 Mar, 2022 18:25 IST|Sakshi

Kim Jong Un Guiding An Ballistic Missile: ఉత్తర కొరియా అధ్యక్షుడు అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి క్షిపణిని వినియోగించింది. ఈ మేరకు 2017 నాటి మిసైల్‌ ప్రయోగాన్నిహాలీవుడ్‌   మూవీ మాదిరి ఫుటేజ్‌ని విడుదల చేసింది. అందులో ఒక పాత స్కూల్‌కి సమీపంలో కిమ్‌ జోంగ్‌ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి 2017 నాటి అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ జెయింట్ హ్వాసాంగ్-17 క్షిపణిని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిచింది. 

ఉత్కంఠభరితమైన సంగీతంలో, ఇద్దరు జనరల్స్ మధ్య కెమరా యాక్షన్‌ అనగానే స్లో మోషన్‌లో కిమ్ వచ్చి తన సన్ గ్లాసెస్‌ని పగలుగొట్టి సైనికుల క్షిపణి ప్రయోగానికి ఆమోదం తెలుపుతున్నట్లు ఉంటుంది. పైగా ఆ క్షిపణి కౌంట్‌డౌన్‌ దృశ్యంలో సైనికులు అగ్ని అని అరుస్తున్నట్లు కనిపించింది. ప్యోంగ్యాంగ్ తన సైనిక సామర్థ్య గొప్పతనాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆ వీడియో ఫుటేజ్‌ ఉంది.

దీన్ని వారు ఒక చలన చిత్రంగా రూపొందించి మరీ సంబురాలు చేసుకున్నారు. అదీ కూడా ఖండాంతర క్షిపణిని విజయవంతం అయిన నేపథ్యంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హీరోగా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన మూవీ మాదిరి వీడియోని రూపొందించారని సెజోంగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని సెంటర్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్‌కు చెందిన చియోంగ్ సియోంగ్-చాంగ్ తెలిపారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ సినీ వీరాభిమాని. ఉత్తర కొరియా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి 1978లో దక్షిణ కొరియా చిత్ర దర్శకుడు  నటిని కిడ్నాప్ చేయాలని ఆదేశించిన ఘనుడు.

ఇప్పుడు కూడా ఉత్తరకొరియా చలనచిత్రాల నిర్మాణం కోసం భారీగా వనరులను కేటాయిస్తుంది గానీ సినిమాలన్ని అధికార కిమ్ కుటుంబాన్ని కీర్తిస్తూ తీయాల్సిందే. శుక్రవారం విడుదల చేసిన మూవీ మాదిరి క్షిపణి వీడియోలో విదేశీ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఉత్తర కొరియా తమ సినిమాల్లో ఎక్కడైన విదేశీ ప్రభావం కనిపిస్తే కఠినంగా శిక్షిస్తుంది.

విదేశీ దుస్తులతో గానీ, విదేశీ చిత్రాలను అనుకరించి గానీ సినిమాలు నిర్మిస్తే శిక్షిస్తుంది. ఏది ఏమైన కిమ్‌ మాటతప్పి మరీ భారీ ఖండాంతర ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగిచండంతో యూఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా యూఎన్‌ భద్రతా మండలి శుక్రవారం ఈ ప్రయోగంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే ఉత్తర కొరియా ఆయుధా ప్రయోగాలపై పలు ఆంక్షలు ఎదుర్కొంటునప్పటికీ వాటన్నింటిన పక్కన పెట్టి మరోసారి తన అత్యుత్సాహాన్ని బయటపెట్టుకుంది.

(చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఉత్తర కొరియా కిమ్ సంబురాలు, వణికిపోతున్న పొరుగు దేశాలు)

మరిన్ని వార్తలు