ప్రకృతి లాగే దేశ రాజకీయాలు మారుతున్నాయి

10 Sep, 2020 15:57 IST|Sakshi

కాలిఫోర్నియా : గురువారం ఉదయం కాలిఫోర్నియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అడవిలో కార్చిచ్చు అంటుకొని అగ్ని కీలలు ఎగిసిపడి బారీగా మంటలు అంటుకున్నాయి. దీంతో నీలం రంగులో ఉండాల్సిన ఆకాశం మొత్తం నారింజ రంగులోకి మారింది. ఈ దృష్యాలను అమెరికన్లు తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. వీళ్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఉన్నారు. బరాక్‌ ఒబామా ఫోటోలను షేర్‌ చేస్తూ రాజకీయ కోణంలో చేసిన ఒక ట్వీట్‌ ఆసక్తికరంగా ఉంది. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒబామా ట్వీట్‌ చేశారు. (చదవండి :వ్యాక్సిన్‌ పంపిణీపై ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు)


'వెస్ట్ కోస్ట్ ప్రాంతమంతటా మంటలంటుకొని వాతావరణం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ప్రకృతి ప్రకోపంతో మారిపోయినట్లే దేశ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు మన దేశాన్ని రక్షించడమనేది బ్యాలెట్‌ చేతుల్లో ఉంది. ప్రకృతిని కాపాడుకోవడానికి బాధ్యత అనే ఓటు ఎంత అవసరమో.. రాజకీయాల్లో కూడా ఓటుకు అంతే  పవర్‌ ఉంటుంది. దానిని సక్రమ మార్గంలో వినియోగించండి.' అంటూ కామెంట్ చేశారు. 

కాలిఫోర్నియాలో మరోసారి కార్చిచ్చు
కాలిఫోర్నియాలో మరోసారి అడవులను కార్చిచ్చు దహించివేస్తోంది. తాజాగా, చెలరేగిన దావానలంలో లక్షలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. బారీగా చెలరేగిన మంటల కారణంగా సమీప ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఓరెగాన్‌లో వందలాది గృహాలు మంటలకు కాలిబూడిదయ్యాయని కాలిఫోర్నియా గవర్నర్ కేట్ బ్రౌన్ తెలిపారు.  

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం ఉపశమనం లభించే సూచనలు కనిపించడంలేదని, గాలులు బలంగా వీస్తుండటంతో పట్టణాలు, నగరాలకు మంటలు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు పట్టణాలు గణనీయంగా దెబ్బతిన్నాయని చెప్పిన బ్రౌన్.. ఎన్ని గృహాలు మంటలకు ఆహుతయ్యాయనేది స్పష్టంగా చెప్పలేదు. కానీ, అత్యవసర నిర్వహణ అధికారులు 4,70,000 ఎకరాలకు పైగా అడవులు కాలిబూడిదవుతున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు