కొత్తగా మరో వ్యాక్సిన్‌..! వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం...!

14 Jun, 2021 19:23 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు  ఇప్పటికే పలు కంపెనీలు వ్యాక్సిన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరో వ్యాక్సిన్‌ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌ను నోవావాక్స్‌ కంపెనీ తయారుచేసింది. ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ వేరియంట్లను 93 శాతం సమర్థవంతంగా ఎదుర్కొగలదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ మాడరేట్‌, సీవియర్ కేసుల్లో 100 శాతం రక్షణ ఇస్తుందని నోవావాక్స్‌ పేర్కొంది. మొత్తంగా 90.4శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. 

నోవావాక్స్‌ కంపెనీ వ్యాక్సిన్‌ను అమెరికా, మెక్సికో ప్రాంతాలకు చెందిన 29, 960 మందిపై పరిశోధన నిర్వహించారు. మేరిల్యాండ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న నోవావాక్స్‌ ఈ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం కోసం దరఖాస్తు చేయనుంది. రెగ్యులేటరీ నుంచి ఆమోదం రాగానే నెలకు సుమారు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయడానికి సిద్థంగా ఉందని నోవావాక్స్‌ కంపెనీ ప్రెసిడెంట్‌, స్టాన్లీ సీ ఎర్క్‌ పేర్కొన్నారు. కాగా నోవావాక్స్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌(NVX-CoV2373) ను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాక్సిన్లను 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: Covid alarm: శరీరంలో వైరస్‌ ఉంటే మోత మోగుడే!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు