వీడియో: వామ్మో.. అణుబాంబు పేలితే ఇట్లా ఉంటదా? వణికిస్తున్న వర్చువల్‌ అనుభవం

8 Nov, 2022 13:57 IST|Sakshi

వైరల్‌: అణు యుద్ధం రాకూడదనేది ప్రతీ ఒక్కరి ప్రార్థన. ఎందుకంటే ఆ పేలుడు తీవ్రత అంత దుష్పరిణామాలకు దారి తీస్తుంది కాబట్టి. అణు బాంబు పడితే ఆ ప్రభావం ఎలా ఉంటదో  మనకు తెలియంది కాదు. జపాన్‌ నగరాలు హీరోషిమా, నాగసాకిలు రెండో ప్రపంచ యుద్ధసమయంలో న్యూక్లియర్‌ బాంబులు పడి.. ఎంతో దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయో ప్రపంచం కళ్లారా వీక్షించింది. అయితే ఆ పేలుడు తీవ్రతను ప్రత్యక్షంగా చూడాలని ఉందా?

ప్రాక్టికల్‌గా సాధ్యంకానీ ఈ అంశాన్ని వర్చువల్‌గా చూసేందుకు వీలయ్యింది. ఆహ్లాదంగా ఉన్న ఓ బీచ్‌లో హఠాత్తుగా అణు బాంబు పేలితే ఎలా ఉంటుంది? ఆ అనుభవమే అందిస్తోంది ఈ వీడియో.. 

అదేదో సినిమాలో వర్ణించినట్లు.. అణు బాంబు పడితే చెట్టు-చేమ బుగ్గిపాలయ్యాయి. నింగి మధ్యలో భారీ పొగ, ధూళి అలుముకున్నాయి. ఆ దెబ్బకు ఆకాశం రంగు మారిపోయింది. వర్చువల్‌గా న్యూక్లియర్‌ పేలుడుకు సంబంధించిన ఈ వీడియో పాతదే అయినా.. ఉక్రెయిన్‌ పై రష్యా ఆక్రమణ, అణు యుద్ధ బెదిరింపుల నేపథ్యంలో మళ్లీ రెడ్డిట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

మరిన్ని వార్తలు