అమెరికా, బ్రిటన్‌లో కరోనా మృత్యుకేళి

31 Dec, 2020 18:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, బ్రిటన్‌ దేశాలకు అత్యంత దుర్దినం ఈ రోజు. ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి మున్నెన్నడు లేనంత ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో బుధవారం నాడు ఒక్క రోజే 3, 903 మరణించగా, లక్షా పాతిక వేల మంది ఆస్పత్రుల పాలయ్యారు. రాగల 24 గంటల్లో దాదాపు 82 వేల మంది మరణించే అవకాశం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా సోకిన వారి సంఖ్య లక్షను దాటడం వరుసగా 29వ రోజు. 2021, జనవరి 23వ తేదీ నాటికి 3,83,000 నుంచి 4,24,000 మంది మరణించే అవకాశం ఉందని సీడీసీ అంచనా వేసింది. ఒక్క లాస్‌ఏంజెలిస్‌ కౌంటీలోనే బుధవారం నాటికి కరోనా మతుల సంఖ్య పదివేలను దాటిందని అధికార వర్గాలు ప్రకటించాయి. (కొత్త వైరస్‌తో మరణాలు ఎక్కువే!)

ఇక బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే కరోనా బారిన పడిన వారిలో 981 మంది మరణించారు. 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత బుధవారం నాటితో పోలిస్తే దేశంలో మతుల సంఖ్య 31 శాతం పెరిగింది. గత బుధవారం నాడు 744 మంది మరణించారు. అలాగే కేసుల సంఖ్య కూడా గత వారంతో పోలిస్తే 27 శాతం పెరిగింది. గత బుధవారం నాడు 39,237 కేసులు నమోదు కాగా, ఈ బుధవారం వారి సంఖ్య 50,023కు చేరుకుంది. దేశంలో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా విజంభణ పెరగుతుండడం వల్లన కేసుల సంఖ్య, మతుల సంఖ్య గణనీయంగా పెరగుతున్నట్లు వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు