Turkey Syria Earthquake: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్‌: వీడియో వైరల్‌

12 Feb, 2023 14:40 IST|Sakshi

టర్కీలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.  టర్కీలో సరిగ్గా అదే సమయంలో ఓ ఆస్పత్రిలోని నర్సులు మాత్రం భూకంప ప్రకంపనాలకు భయంతో పారిపోలేదు.  అక్కడే ఉండి ఇంక్యుబేటర్‌లో ఉన్న నవజాత శిశువులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువల ఉన్న గది వద్దకు త్వరిత గతిన చేరుకుని, అక్కడే ఉండి వాటిని పడిపోకుండా పట్టుకుని అలానే నుంచొని ఉన్నారు.

వారు చేసిన ప్రయత్నాల కారణంగా ఆ ఇంక్యుబేటర్‌లు కింద పడిపోకుండా ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోని టర్కీలోని ఫాత్మా సాహిన్‌ అనే రాజకీయవేత్త ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కాగా టర్కీ, సీరియాలలో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 30 వేల మందికి చేరుకున్న సంగతి తెలిసిందే.

(చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం)

మరిన్ని వార్తలు