‘గే లవ్‌ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు..

14 Aug, 2023 07:28 IST|Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 1982లో తన మాజీ ప్రేమికురాలికి ఒక లేఖ రాశారు. దానిలో ఏమి రాశారన్నది తాజాగా బయటపడి సంచలనంగా మారింది. బరాక్‌ ఒబామాకు గే సెక్స్‌ అంటే ఇష్టమని ఈ లెటర్‌ ద్వారా వెల్లడయ్యింది. తనకు రోజూ పురుషులను దగ్గరికి తీసుకోవడమంటే ఇష్టమని, అయితే అది తన కల్పన మాత్రమేనని దానిలో ఒబామా పేర్కొన్నారు. బరాక్‌ ఒబామా తన మాజీ ప్రియురాలికి రాసిన లేఖను న్యూయార్క్‌ పోస్టు బయటపెట్టింది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒబామాకు గే సెక్స్‌ ఫాంటసీ అంటే ఇష్టమనే విషయాన్ని ఈ ఉత్తరం వెల్లడించింది. దానిలో ఆయన తాను పురుషులతో రోజూ లైంగిక కార్యకలాలపాల్లో పాల్గొంటున్నట్లు కలలుకంటానని తెలిపారు. ఈ ఉత్తరం రాసే సమయానికి ఒబామా వయసు 21 ఏళ్లు. 1982 నవంబరులో ఆయన తన మాజీ ప్రేమికురాలు అలెక్స్‌ మెక్‌నియర్‌కు ఈ ఉత్తరం రాశారు. ఒబామా, అలెక్స్‌ ఆరోజుల్లో లాస్‌ఏంజిల్స్‌లోని ఆక్సిడెంటల్‌ కాలేజీ విద్యార్థులు. అప్పుడు వారు రిలేషన్‌లో ఉండేవారు. 

ఆ ఉత్తరంలో ఒబామా.. హోమో సెక్సువాలిటీ గురించి ప్రస్తావించారు. 40 ఏళ్ల క్రితం నాటి ఈ లెటర్‌ను ఒబామా తాను రాసినదేనని అంగీకరించారు. తాను ఒక పురుషుని రూపంలోనే మరో పురుషునితో ఉండేందుకు ఇష్టపడ్డానని ఒబామా పేర్కొన్నారు. ఒబామాతో  రిలేషన్‌ ముగిసిన అనంతరం అతని మాజీ ప్రేమికురాలు అలెక్స్‌ ఆ లేఖలోని కొన్ని వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరం ఎమోరీ యూనివర్శిటీలో ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 1992లో మిషెల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 
ఇది కూడా చదవండి: 6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్‌లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట!

మరిన్ని వార్తలు