ఈయూలో చేరడానికి మాల్దోవా, జార్జియా సిద్ధం!

4 Mar, 2022 09:14 IST|Sakshi

మిన్స్‌క్‌ (బెలారస్‌): యూరోపియన్‌ యూనియన్‌లో చేరడానికి మాల్దోవా, జార్జియా కూడా సిద్ధంగా ఉన్నాయని ఈయూ అధికారి ఒకరు వెల్లడించారు. కూటమిలో చేరుతామని అవి కూడా త్వరలో కోరుతాయని ఆశిస్తున్నామన్నారు. తూర్పు యూరప్‌ దేశాలైన ఈ రెండు ఇప్పటికే ఈయూ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నాయి. అయితే ఆ రెండు దేశాలు సభ్యత్వం కోరడం మాత్రం అతి పెద్ద పరిణామమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌లో 27 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈయూలో చేరడానికి ఎవరైనా దరఖాస్తు కోరితే ఆ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. రాజకీయంగా, వాణిజ్యపరంగా జరపాల్సిన కొన్ని లాంఛనాలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. 

(చదవండి: యూరప్‌ అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌పై రష్యా దాడి.. పేలిందంటే చెర్నోబిల్‌ కంటే పెనువిషాదం!)

మరిన్ని వార్తలు