వైరల్‌: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్‌

22 May, 2021 14:37 IST|Sakshi

ఆమ్‌స్టర్‌డామ్‌: మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది తన ఉనికి. బతికినంత కాలం ఆరోగ్యంతో జీవించడం ప్రధానం. కానీ, ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. వయసుతోబాటు శరీరం పటుత్వం కోల్పోతుంది. ఎముకలు పలచబడతాయి. చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. సహజంగా కృష్ణా!రామా! అంటూ కాలం వెళ్లదీస్తారు. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లోని హేగ్ వీధుల్లో ఓ వృద్ధుడు వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 2.52 లక్షల నెటిజన్లు వీక్షించారు. 10 వేల మంది నెటిజన్లు లైక్‌ కొట్టారు.

ఈ వీడియోలో నల్లని రంగు గల పొడవాటి కోటు, బూడిద రంగు చొక్కా, టై, ప్యాంటు, టాన్ టోపీ ధరించిన వృద్ధుడు చేతిలో కర్రతో  వీధిలోని సంగీతకారుడి  ట్యూన్లకు అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు. గిటారిస్ట్ కూడా ఆ వృద్ధుడితో కలిసి స్టెప్పులేస్తాడు. అయితే  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది. దీనిపై ఓ నెటిన్‌ స్పందిస్తూ..‘‘దీన్ని ప్రేమించండి’’ అని కామెంట్‌ చేశారు. ‘‘ఇలా డ్యాన్స్‌ చేయడం మరొకరికి సాధ్యం కాదు. ఈ వ్యక్తి నిజంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు’’ అంటూ రాసుకొచ్చారు.

(చదవండి: Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్‌ వేవ్‌ ఆపటం కష్టం’)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు