Viral Video: అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్‌!

23 Nov, 2021 19:33 IST|Sakshi

చైనా: వృద్ధ మహిళ తను నివసించే అపార్టుమెంట్‌లోని బాల్కని నుంచి అదుపు తప్పి కిందకు జారీపడింది. అయితే బట్టలు ఆరేసే ర్యాక్‌కు ఆమె చిక్కుకొని ప్రమాదకరంగా తలకిందులుగా వేలాడింది. ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ చోటు చేసుకుంది. అపార్టుమెంట్‌లోని 19వ అంతస్తు బాల్కని నుంచి ఆమె కింది​కి వేలాడటం గమనించిన స్థానికులు ఫైర్‌ ఫైటర్లకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌ ఫైటర్లు ఆ వృద్ధురాలని సురక్షితంగా కాపాడారు. ఆ మహిళ గాయాలపాలు కాకుండా.. ప్రాణాపాయం తప్పిందని ఫైర్‌ ఫైటరర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు