Viral video: గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్‌ లేదంటే...

8 Jun, 2022 19:38 IST|Sakshi

ఇటీవల సందర్శకులు జూలకు వెళ్లి అక్కడ ఉన్న జంతువులతో లేనిపోనీ కష్టాలు కొనితెచ్చుకున్న సంధార్భాలు అనేకం. జూ అధికారులు సైతం ప్రమాదకరమైన జంతువుల సమీపంలోకి వెళ్లొద్దు అని హెచ్చరిక బోర్డులు పెట్టినా కూడా లెక్కచేయకుండా వెళ్లి పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని క్రూర జంతువులు దగ్గరకు వెళ్లేటప్పుడు జంతు సంరక్షక్షులు చెప్పే సూచనలు పాటించాలి లేదంటే ఆ జంతువుల దాడికి బలైపోక తప్పదు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం కొద్ది బయటపడ్డాడు.

వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని కసాంగ్ కులిమ్ జూలో టీనా అనే గొర్రిల్లా బోనులో బంధించి ఉంది. హసన్ అరిఫిన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఈ జూని సందర్శించడానికి వెళ్లాడు. ఐతే అతను ఈ టీనా అనే గొర్రిల్లా బోను వద్దకు ఇచ్చి రెండు చేతుల ఇచ్చి సరదాగా రా అన్నాడు. అంతే అది ఒక్కసారిగా అతన్ని కోపంగా పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. అక్కడి అతను దూరంగానే ఉన్నాడు. ఐతే ఆ గోర్రిల్లా మాత్రం ఆ వ్యక్తి చొక్కాను పట్టుకుని బోనులోకి లాగేందుకు ట్రై చేస్తోంది.

సహయం కోసం హసన్ తన స్నేహితుడిన పిలిచాడు. అతని స్నేహితుడు సైతం తన ఫ్రెండ్‌ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఆ గొర్రిల్లా అతని కాలుని కదలకుండా ఉడుం పట్టు పట్టేసింది. ఇక ఎలాగోలాగా బలవంతంగా ఆ గొర్రిల్లా ఉడుంపట్టు నుంచి లాగేందుకు శతవిధాల ప్రయత్నిస్తూంటే అది ఆ వ్యక్తిని కూడా పక్కకు తోసేసింది. చివరికి హసన్‌ తన కాలుని గొర్రిల్లా కొరకబోతుందనగా కొద్ది సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఇక రాను రాను టమాటా కెచప్‌ తయారు చేయకపోవచ్చు!)

మరిన్ని వార్తలు