ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పే ముందు.. భారీ ప్లాన్‌ వేసిన బోరిస్‌.. చెకర్స్‌లో..

8 Jul, 2022 10:24 IST|Sakshi

లండన్‌: ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని గురువారం అధికారికంగా ప్రకటించారు బోరిస్ జాన్సన్‌. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే తాను ప్రధాని హోదాలో ఉండగానే చివరగా గ్రాండ్ పార్టీకి ఆయన్‌ ప్లాన్ చేసినట్లు బోరిస్ సన్నిహిత వర్గాలు చెప్పాయని బ్రిటన్ మీడియా తెలిపింది. 

చాలాకాలంగా సహజీవనం చేస్తున్న కేరీని గతేడాది పెళ్లి చేసుకున్నారు ఆయన. అయితే కరోనా కారణాల వల్ల ఈ వేడుక అతికొద్ది మంది సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే ఇప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలని బోరిస్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ప్రధాని అధికారిక నివాసం  'చెకర్స్‌'లో ఈ పార్టీ ఉండనుంది.

బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం 10 డౌన్‌ స్ట్రీట్‌లో ఉంటుంది. చెకర్స్‌ ప్రధాని అధికారిక నివాసం. 600 హెక్టార్ల విస్తీర్ణంతో ఎంతో విశాలంగా ఉండే ఈ భవన సముదాయంలో ప్రపంచనేతలతో సమావేశాలు, విందు కార్యక్రమాలు, పార్టీలకు బ్రిటన్ ప్రధానులు ఉపయోగిస్తుంటారు. 1920 నుంచి ఇది వాడుకలో ఉంది.

చెకర్స్‌లో జులై 30న బోరిస్ పార్టీ ఇవ్వనున్నట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఇది ఎంతో గ్రాండ్‌గా, గ్లామరస్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపింది. బోరిస్ స్నేహితులు, కుటుంబసభ్యులకు ఇప్పటికే ఆహ్వానం అందిందని మీడియా వెల్లడించింది.

మరిన్ని వార్తలు