బ్యాంకాక్‌ నుంచి భారత్‌కు ఆక్సిజన్‌ ట్యాంకర్లు

29 Apr, 2021 08:39 IST|Sakshi

న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌ నుంచి భారత్‌కు నాలుగు ఆక్సిజన్‌ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ ద్వారా ఇవి గుజరాత్‌లోని జామ్‌ నగర్‌కి బుధవారం సాయంత్రం చేరుకున్నట్లు అధికా రులు వెల్లడించారు. మరోవైపు సింగపూర్‌ నుంచి రెండు సీ–130 ఎయిర్‌ క్రాఫ్ట్‌ల ద్వారా 256 ఆక్సిజన్‌ సిలిండర్లు పశ్చిమబెంగాల్‌లోని పనాగఢ్‌కు చేరుకున్నా యి.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ లేమితో భారత్‌ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత వాయు సేన పలు ట్యాంకర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక దేశంలో సైతం పలు ప్రాంతాల మధ్య కూడా యుద్ధ విమానాలను ఉపయోగించి ట్యాంకర్లను తరలిస్తున్నారు. ఆగ్రా, హిందోన్, భోపాల్, చండీగఢ్‌ల నుంచి ఒక్కో సిలిండర్‌ చొప్పున రాంచీకి తరలిం చారు. అవేగాక ఇండోర్‌ నుంచి రాయ్‌పూర్‌కు రెండు ట్యాంకర్లు, జోధ్‌పూర్‌ నుంచి జామ్‌ నగర్‌కు రెండు ట్యాంకర్లు తరలించారు.
చదవండి: కరోనా కల్లోలం.. 3 వేల మంది పేషెంట్లు పరారీ!

 

మరిన్ని వార్తలు