నా పెళ్లి నా ఇష్టం.. మీకెందుకు అంత ఆత్రం: నటి

1 Dec, 2020 19:08 IST|Sakshi

ఇస్లామాబాద్‌:  పాక్‌ నటి మెహ్విష్‌ హయత్‌ పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, మాజీ అధ్యక్షుడు ఆసీఫ్‌ అలీ జర్ధారీ కుమారుడు బిలావాల్‌ భుట్టో జర్ధారీతో వివాహం అంటూ వస్తున్న వార్తలను  ఆమె ఖండించారు. సరైన సమాచారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్త సృష్టించిన వారిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనకు సంబంధాలను కలిపే ప్రయత్నాలను ఆపి కాస్తా విశ్రాంతి తీసుకొండని నెటిజన్‌లకు ఆమె చురకలు అట్టించారు. అంతేగాక దీనిపై మంగళవారం ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘వివాహం అనేది వ్యక్తిగతం. నేను ఎవరిని చేసుకుంటాననేది నా సొంత నిర్ణయం. ఆ రోజు వచ్చినప్పుడు అతను ఎవరనేది మీకే తెలుస్తుంది. అప్పటీ వరకు ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించడం ఆపండి’ అంటూ మెహ్విష్‌ నెటిజన్‌లపై మండిపడ్డారు. అయితే మెహ్విష్‌ ఓ ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్‌ బ్యాచిలర్‌ ఎవరని అడగ్గా ఆమె బిలావాల్‌ అని చెప్పారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అవ్వడంతో ఆమె, రాజకీయ నాయకుడు బిలావాల్‌లు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారంటూ నెట్టింటా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

అయితే ఈ ఇంటర్వ్యూలో.. మెహ్విష్‌ను ఇంతకీ మీ జీవిత భాగస్వామిని కలుసుకున్నారా అని అడగ్గా... ‘లేదు ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి తారసపడ లేదు. ఎందుకంటే చిన్న వయసులోనే నేను నటిగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే మెహ్విష్‌ హయత్‌గా నేను ఒకరి ప్రేమలో పడటం నాకు ఇష్టం లేదు. కానీ నేను ఓ మహిళనే కాబట్టి బహుశా నాకు నచ్చిన వ్యక్తి దొరికితే ప్రేమలో పడొచ్చు’ అని చెప్పుకొచ్చారు. అయితే భర్తగా ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. మంచి ఎత్తు ఉండాలని, అదే విధంగా ఆకర్షనీయమైన రంగు ఉండాలని తన మనసులో మాటను చెప్పారు. అయితే ఇంటర్య్వూయర్‌ మీరు పర్ఫెక్ట్‌ బ్యాచిలర్ అని‌ ఎవరిని అనుకుంటున్నారని అడగ్గా.. మెహ్విష్‌ ఆలోచించి కొన్ని క్షణాలకు బిలావాల్‌? అని చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా