-

ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్‌ నాయకుడు

6 Nov, 2022 15:30 IST|Sakshi

పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ సెనెటర్‌ ఆజం ఖాన్‌ స్వాతి ఒక అభ్యంతరకర వీడియో గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజం ఖాన్‌ గతనెలలో ట్విట్టర్‌లో జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాను విమర్శించడంతో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) ఆయన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో ప్రసంగిస్తూ...తన భార్యకు గత రాత్రి ఒక గుర్తు తెలియని నెంబర్‌ నుంచి అభ్యంతరకర వీడియో వచ్చిందని చెప్పారు.

ఐతే నా దేశంలో కూతుళ్లు, మనవరాళ్లు ఉన్నారు కాబట్టి ఆ వీడియో గురించి ఏమి ప్రస్తావించలేను అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను తన భార్య క్వెట్టాను సందర్శించినప్పుడూ ఈ వీడియోని తీశారని, దీంతో తనను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారంటూ ఆవేదన చెందారు. అంతేగాదు తనను కస్టడీలో ఉంచి బట్టలు విప్పి ఎగతాళి చేస్తూ.. టార్చర్‌ చేసినట్లు తెలిపారు.  ఐతే ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అది ఫేక్‌ వీడియో అని, ఫోటోషాప్‌తో సృష్టించిన నకిలీ వీడియో అని ప్రకటించింది.

ఐతే సెనెటర్‌ ఈ విషయమై ఒత్తిడి చేస్తున్నారు కాటట్టి అధికారికంగా దరఖాస్తు దాఖలు చేస్తే విచారణ చేస్తామని ఫెడరల్‌ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ...ఆజం ఖాన్‌ స్వాతిని చిత్రహింసలకు గురిచేయడాన్ని ఖండించారు. అలాగే ఆయన భార్య అనుభవిస్తున్న అవమానకరమైన బాధ, ఆవేదనకు పాకిస్తాన్‌ తరుఫున తాను క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు.

(చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌.. ‘కీహోల్‌’లోంచి ఏడు బాణాలు!)

మరిన్ని వార్తలు