భారత్‌తో శాంతియుత బంధాన్ని కోరుతున్నాం! 

13 Apr, 2022 08:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఇండియాతో శాంతియుత సహకార సంబంధాలను కోరుతున్నామని పాక్‌ నూతన ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. తనకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. జమ్ము, కశ్మీర్‌పై వివాదం పరిష్కారమైతేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని పాత పాటే పాడారు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌ ఎన్నో నష్టాలు చవిచూస్తోందన్నారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా కశ్మీర్‌ రక్తమోడుతోంటూ షరీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! పదవి చేపట్టిన అనంతరం ప్రధానిగా తొలిరోజున ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న వారానికి రెండు రోజుల సెలవులను షరీఫ్‌ మంగళవారం రద్దు చేశారు. దీంతో పాటు వారి పనివేళల్లో కూడా మార్పులు చేశారు. ఇకపై అధికారులకు కేవలం ఆదివారం మాత్రమే వీక్లీ ఆఫ్‌ ఉంటుందన్నారు.  

చదవండి: (కశ్మీర్‌పై షహబాజ్‌ కారుకూతలు)

>
మరిన్ని వార్తలు