పాక్‌లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం

12 Feb, 2023 11:03 IST|Sakshi

పాకిస్తాన్‌ ఓ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో పోలీసులు వెంటనే అప్పమత్తమయ్యారు. వివరాల్లోకెళ్తే..దైవదూషణ ఆరోపణలపై 20 ఏళ్ల మహ్మద్‌ వారిస్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనుకోకుండా ఓ గుంపు పోలీస్టేషన్‌లోకి ప్రవేశించి వారిస్‌పై దాడి చేసి హతమార్చింది. అంతేగాదు వారిసి మృతదేహానికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తుండగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో కొంతమంది అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఉండటంతో ఆ గుంపును అడ్డుకోలేకపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి పాక్‌లో దైవదూషణ కూడా నేరమే, దీనికి మరణశిక్ష విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇలాంటి ఘటనలు పాక్‌లో గతంలో చాలానే జరిగాయి. అంతేగాదు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ విషయమై పలుమార్లు పాక్‌ని విమర్శించింది కూడా.

ఈ మేరకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించనట్లు సమాచారం. అలాగే ఆ గుంపు కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపకుండా అడ్డుకోవండంలో విఫలమైనందుకు పలవురు పోలీసులను కూడా సస్పెండ్‌ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

(చదవండి: అమెరికా గగనతలంలో మరో బెలూన్‌ కలకలం)

మరిన్ని వార్తలు