ఇమ్రాన్‌ ఖాన్‌ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..

18 Mar, 2023 15:19 IST|Sakshi

పాకిస్తాన్‌ తెహ్రీకీ ఇన్సాఫ్‌ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు పాక్‌ ప్రభుత్వం గట్టి వ్యూహమే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులగా ఖాన్‌ అరెస్టు కోసం ఆయన నివాసం వద్ద పెద్ద​ హైడ్రామానే సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి పోలీసులు ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. అదీ కూడా ఖాన్‌ అవినీతి కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి వెళ్లగానే ఆయన ఇంట్లోకి పోలీసులు చొరబడి దాడులకు పాల్పడ్డారు.

ఆ సమయంలో ఆయన భార్య బుష్రా బేగం ఒక్కరే ఇంట్లో ఉన్నట్ల సమాచారం. ఈ మేరకు పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విట్టర్‌ వేదికగా.. నా భార్య బుష్రా బేగం ఒంటరిగా ఉన్న జమాన్‌పార్క్‌లోని నా ఇంటిపై పంజాబ్‌పోలీసులు దాడికి పాల్పడ్డారు. అసలు ఇది ఏ చట్టం ‍ప్రకార ఇలా చేస్తున్నారో చెప్పండని అని నిలదీశారు. పరారీలో ఉన్న నవాజ్‌ షరీఫను క్విడ్‌ ప్రోకోగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు లండన్‌ ప్లాన్‌లో భాగంగా ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

కాగా ఖాన్‌ని అరెస్టు చేసేందుకు ఆయన మద్దతుదారులు పోలీసులు మధ్య చాలా రోజులపాటు జరిగిన ప్రతిష్టంభన, తీవ్రమైన ఘర్షణలను అన్నింటిని పక్కన పెట్టి ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుక సంబధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి:  నన్ను అపహరించి, చంపేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యం)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు