యువతి నృత్యం వివాదాస్పదం... పాక్‌ యూనివర్సిటీ నోటీసులు

22 Oct, 2022 14:37 IST|Sakshi

ఒక ప్రైవేట్‌ యునివర్సిటీ కార్యక్రమంలో యువతీ చేసిన నృత్యం వివాదాస్పదమైంది. దీంతో సదరు యూనివర్సిటీకి  నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. పాక్‌లో పెషావర్‌లోని ఎన్‌ఎస్‌ యూనివర్సిటీలో హునార్‌ మేళ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ వేడుకల్లో దాదాపు 13 కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఒక యువతి డ్యాన్స్‌ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ తెగ వైరల్‌ అయ్యింది.

దీంతో నెటిజన్లు ఇలాంటి కార్యక్రమాలకు దేశానికి అవసరమా అంటూ మండిపడతూ ట్వీట్‌ చేశారు. సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాక్‌ ఖైబర్‌ మెడికల్‌ యూనివర్సిటీ(కేఎంయూ) ఈ విషయమై సీరియస్‌ అయ్యి నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో సదరు యువతి బిగుతుగా ఉండే డ్రస్‌ వేసుకుని వేదికపై డ్యాన్స్‌లు చేయడం వల్లే  వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు ఖైబర్‌ మెడికల్‌ యూనిర్సిటీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అనేతికం, అసాంఘీకం అంటూ మండిపడుతూ చివాట్లు పెట్టింది.

అంతేగాదు ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు యూనివర్సిటి ఎన్‌ఎస్సీ డైరెక్టర్‌కి నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యక్రమాలను కేఎంయూ లోగో పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు నైతిక విలువలతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ పవిత్రతను కాపాడుకోవాలని మందలించింది. అవసరమనుకుంటే సదరు ప్రైవేట్‌ యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. 

(చదవండి: చైనా కమ్యునిస్ట్‌ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన...హఠాత్తుగా నిష్క్రమించిన జుంటావో)

మరిన్ని వార్తలు