జైలుకెళ్లొచ్చాక కూడా బిడ్డలపై అత్యాచారం చేస్తా: తండ్రి

27 Oct, 2021 17:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కన్నబిడ్డపై తండ్రి పైశాచికం

ఏంటని ప్రశ్నించిన భార్యకు బెదిరింపులు

న్యాయం చేయాలంటూ కోర్టులో భార్య ఆత్మహత్యాయత్నం

ఇస్లామాబాద్‌: సమాజంలో ఆడవారిపై అకృత్యాలు పెరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి.. వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. పాము తన పిల్లలను తానే తిన్న చందంగా.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడతున్నాడు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పసిమొగ్గలు నలిగిపోతున్నాయి. భార్యకు విషయం తెలిసినా ప్రతిఘటించలేని పరిస్థితులే ఎక్కువ.

తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కన్న తండ్రి బిడ్డను చెరబట్టాడు. ఏడాది నుంచి బిడ్డపై తన పశువాంఛ తీర్చుకుంటున్నాడు. విషయం తల్లికి తెలిసింది. భర్తకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఉంది. తన బిడ్డను కాపాడమంటూ కోర్టులోనే ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

లాహోర్‌కు చెందిర ఓ మహిళకు ఐదుగురు సంతానం. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరు విడిపోయారు. ముగ్గురు ఆడపిల్లలు భర్త దగ్గర ఉంటుండగా.. ఇద్దరు భార్యతో ఉంటున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. ఏడాది నుంచి 15 ఏళ్ల కుమార్తెపై దారుణానికి ఒడిగడుతున్నాడు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో బాలిక మౌనంగా దారుణాన్ని భరిస్తూ వస్తోంది. 
(చదవండి: డైరెక్టర్‌ శంకర్‌ అల్లుడు, క్రికెటర్‌ రోహిత్‌పై లైంగిక వేధింపుల కేసు!)

ఈ క్రమంలో భార్త చేస్తోన్న దారుణం గురించి భార్యకు తెలిసింది. ‘‘ఏంటీ పని’’ అని నిలదీస్తే.. ‘‘నా ఇష్టం.. పోలీసులుకు చెప్పుకుంటావా.. చెప్పు. జైలు నుంచి వచ్చాక మళ్లీ నీ బిడ్డలందరిపై అత్యాచారం చేస్తాను’’ అని బెదిరించాడు. ఈ క్రమంలో బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆ తల్లికి అర్థం కాలేదు. భర్తపై వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆమె ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఏం చేయాలో పాలుపోని మహిళ.. ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. 
(చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్‌.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు)

ఈ క్రమంలో సదరు మహిళ సెషన్స్‌ కోర్టులో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సజీవ దహనం చేసుకోవాలని భావించింది. కానీ చుట్టూ ఉన్న జనాలు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సెషన్‌ కోర్టు జడ్జి మహిళ భర్తపై తగిన చర్యలు తీసుకోవాలని.. బాధిత బాలికకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

చదవండి: పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్‌ అరెస్టు

మరిన్ని వార్తలు