భారత్‌ ఆస్తులను ధ్వంసం చేయండి

19 Jul, 2021 03:51 IST|Sakshi

తాలిబన్లకు పాక్‌ ఐఎస్‌ఐ ఆదేశాలు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో భారత్‌ నిర్మించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ధ్వంసం చేయాలని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అఫ్గాన్‌లోని తమ వారిని, తాలిబన్లను ఆదేశించింది. పాకిస్తాన్‌ నుంచి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తాలిబన్లకు మద్దతుగా చాలామంది అఫ్గాన్‌ వెళ్లారని, అక్కడి భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని వారిని ఆదేశించారని అఫ్గాన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తాలిబన్‌ల ఆక్రమణలోకి వచ్చిన ప్రాంతాల్లో వారి తొలి లక్ష్యం భారత్‌కు సంబంధించిన ఆస్తులు, భవనాలేనని తెలిసిందని పేర్కొన్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌లో ఉన్నవారు కాకుండా, ఇటీవలి కాలంలో కనీసం 10 వేల మంది పాకిస్తానీయులు తాలిబన్లకు మద్దతుగా వివిధ సరిహద్దు మార్గాల ద్వారా అఫ్గానిస్తాన్‌ వెళ్లారని సమాచారం. అఫ్గానిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్‌ సుమారు 300 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. భారత్‌ నిధుల ద్వారా నిర్మితమైన వాటిలో డేలారం– జారంజ్‌ల మధ్య నిర్మించిన 218 కిమీల రహదారి, సల్మా డ్యామ్, అఫ్గాన్‌ పార్లమెంట్‌ భవనం.. ఉన్నాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు