‘పాకిస్థాన్‌కు ఆయన నిజమైన స్నేహితుడు’.. జిన్‌పింగ్‌కు పాక్‌ అభినందనలు

23 Oct, 2022 21:38 IST|Sakshi

ఇస్లామాబాద్‌: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌(69) రికార్డ్‌ స్థాయిలో మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నిక కావటంపై హర్షం వ్యక్తం చేశారు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి హెహబాజ్‌ షరీఫ్‌. తమ దేశానికి ఆయన నిజమైన స్నేహితుడని అభివర్ణిస్తూ ట్వీట్‌ చేశారు ప్రధాని. జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.   

‘సీపీసీ జనరల్‌ సెక్రటరీగా మూడోసారి ఎన్నికైనందుకు యావత్‌ పాకిస్థాన్‌ తరఫున షీ జిన్‌పింగ్‌కు నా అభినందనలు. తెలివైన సారథ్యం, చైనా ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకున్న నిబద్ధతకు ఇది తార్కాణం’ అని ట్వీట్‌ చేశారు ప్రధాని షెహ్‌బాజ్‌. మరోవైపు.. జిన్‌పింగ్‌ ఎన్నికపై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ కూడా స్పందించారు. ‘సీపీసీ జనరల్‌ సెక్రటరీగా మరోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌కు అభినందనలు. పాకిస్థాన్‌కు నిజమైన స్నేహితుడు, పాక్‌-చైనాల వ్యూహాత్మక బంధానికి  బలమైన మద్దతుదారుడు’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు