Pakistan: ఇకపై సీరియల్స్‌లో ‘ఆ సీన్లు’ ప్రసారం చేయకూడదు

23 Oct, 2021 13:36 IST|Sakshi

ఇస్లామాబాద్‌: కాలం మారుతున్న కొద్ది ప్రతి రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మంచికి దారితీస్తే.. మరికొన్ని అతిని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్‌ చూస్తే పైన చెప్పిన మాట నిజం అనిపిస్తుంది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ఇప్పుడది సీరియల్స్‌ కూడా అంటుకుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీరియల్స్‌ కూడా రోమాంటిక్‌ సీన్లు ప్రసారం అవుతున్నాయి. 

అయితే ఇక మీదట టీవీల్లో ప్రసారం అయ్యే సీరియల్స్‌లో కౌగిలించుకోవడం, రోమాన్స్‌ చేసే సన్నివేశాలు ప్రసారం చేయకూడదని పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్‌ ఎలాక్ట్రానిక్‌ మీడియా రెగ్యూలేటరి అథారటీ(పీఈఎంఆర్‌ఏ) ఉత్తుర్వులు జారీ చేసింది. సీరియల్స్‌లో ఇలాంటి సన్నివేశాలు బాగా పెరిగిపోయానని తమకు ఫిర్యాదులు వచ్చాయని పెమ్రా తెలిపింది. ఇలాంటి సన్నివేశాలు ప్రసారం చేసే సీరియల్స్‌ పాకిస్తాన్‌ సమాజానికి పూర్తి వ్యతిరేకం అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
(చదవండి: సీరియల్‌ ప్రమోషన్‌లో కృతిశెట్టి.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?)

ఈ మేరకు ‘‘కౌగిలించుకోవడం, ఒకరినొకరు లాలించడం, వివాహేతర సంబంధాలు, పడకగది సన్నివేశాలు, భార్యభర్తల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు, అసభ్యకరంగా దుస్తులు ధరించడం వంటి సీన్లు ఇస్లామిక్ బోధనలు, పాకిస్తానీ సమాజం సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కిందకే వస్తుంది. కనుక ఇలాంటి సీరియల్స్‌ని ప్రసారం చేసే ముందు సదరు చానెల్స్‌ ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకుని.. అసభ్యతకు తావులేదని భావించిన తర్వాతే ప్రసారం చేయాలి’’ అని పెమ్రా తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
(చదవండి: సన్నిహిత సన్నివేశాల రూపశిల్పి)

పెమ్రా నోటిఫికేషన్‌పై లీగల్, హ్యూమన్ రైట్స్ ప్రొఫెషనల్ రీమా ఒమర్  ప్రతిస్పందిస్తూ, "పెమ్రా తీసుకున్న నిర్ణయం సరైంది. వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం, ఆప్యాయత 'పాకిస్తానీ సమాజంలో ఉండదు'. మా 'సంస్కృతి' నియంత్రణ, దుర్వినియోగం, హింస మాత్రమే. ఇటువంటి పరాయి విలువలు విధించకుండా మనమందరం మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. 

చదవండి: ‘యాక్‌.. ఇలాంటి చెత్త సీన్లు ఎలా తీస్తారు మీరు?’

మరిన్ని వార్తలు