MY Shift Is Ending: ఎమర్జెన్సీ ల్యాడింగ్‌ తర్వాత ప్రయాణికులకు ఝలక్‌ ఇచ్చిన పైలెట్‌...

21 Jan, 2022 17:00 IST|Sakshi

విమానాలను వాతావరణ పరిస్థితుల రీత్యా లేక సాంకేతిక లోపం కారణంగానో ఒక్కోసారి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారికి హోటల్‌ వసతి కూడా ఏర్పాటు చేయడమో లేక మరో విమానంలో పంపించడమో జరుగుతుంది. అయితే ఇక్కడోక పైలెట్‌ మాత్రం అత్యవసర ల్యాండిగ్‌ తర్వాత తన డ్యూటీ ముగిసిందంటూ ...విమానాన్ని కొనసాగించాడానికి నిరాకరించాడు. 

అసలు విషయంలోకెళ్తే...రియాద్ నుండి ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్‌ సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయ్యింది. ఆ తర్వాత పైలెట్‌ తన షిఫ్ట్‌ అయిపోయిందని చెప్పి విమానాన్ని కొనసాగించడానికి నిరాకరించాడు.

అంతే ప్రయాణికులు ఆగ్రహంతో నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో  పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దమ్మామ్ విమానాశ్రయ భద్రతాధికారులను రంగంలోకి దిగింది. ఈ మేరకు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరేవరకు హోటల్‌లోనే వసతి కల్పించారు. అయితే విమాన భద్రత దృష్ట్యా పైలెట్‌ విశ్రాంతి తీసుకోవాలని,  పైగా ప్రయాణికులందరూ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకునేంతవరకు వారికి హోటళ్లలో అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశాం అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మీడియాకి తెలిపారు.

(చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?)

మరిన్ని వార్తలు