పాకిస్తాన్‌కు 4.5 కోట్ల కరోనా టీకా డోసులు

11 Mar, 2021 04:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన కరోనా టీకాలు త్వరలో పాకిస్తాన్‌కు పంపిణీ కానున్నాయి. పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ టీకా 4.5 కోట్ల డోసుల్ని ఫిబ్రవరి–మే మధ్య పాక్‌కి భారత్‌ పంపనుంది. నిరుపేద దేశాలకు కూడా వ్యాక్సిన్‌ అందించాలన్న ఉద్దేశంతో ఐక్య రాజ్యసమితి చేపట్టిన యునైటెడ్‌ గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యూ నిజేషన్‌ (గవి) కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్‌కు మేడిన్‌ ఇండియా టీకా సరఫరా కానుంది. ఇప్పటికే భారత్‌ 65 దేశాలకు కరోనా టీకా పంపిణీ చేస్తోంది. గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా కొన్ని దేశా లకు ఉచితంగా ఇస్తుంటే, మరికొన్ని దేశాల నుంచి డబ్బులు తీసుకొని పంపి స్తోంది. సార్క్‌ దేశాల్లో ఇప్పటివరకు పాకిస్తాన్‌ ఒక్కటే భారత్‌ నుంచి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ను తీసుకోలేదు.  

చదవండి: (అమ్మానాన్నలపై కేసు పెట్టిన కొడుకు)

మరిన్ని వార్తలు