Omicron Variant: పాకిస్తాన్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు

13 Dec, 2021 20:44 IST|Sakshi

ఇస్లామాబాద్ : కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా పంజా విసురుతోంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపిన ప్రకారం ఇప్పటి వరకు 63  దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. తాజాగా పాకిస్తాన్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది.. కరాచీకి చెందిన 57 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు పాకిస్థాన్‌ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సిఒసి) సోమవారం నిర్ధారించింది. అయితే ఒమిక్రాన్‌ సోకిన మహిళ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోన్నట్లు గుర్తించారు.
చదవండి: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

కరాచీకి చెందిన ఒమిక్రాన్‌ బాధితురాలు ఆగాఖాన్ యూనివర్శిటీ కరోనా లక్షణాలతో గతవారం ఆస్పత్రిలో చేరగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇస్లామాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. బాధితురాలు ప్రస్తుతం ఇంటివద్దనే క్షేమంగా ఉందని, అన్ని పనులు చేసుకుంటోందని ఆస్పత్రి ప్రకటించింది.
చదవండి: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం

మరిన్ని వార్తలు