పాకిస్తాన్‌ ఆంక్షలు...నో జీన్స్‌ అండ్‌ టైట్స్‌

9 Sep, 2021 21:44 IST|Sakshi

ఇస్లామాబాద్‌: కొన్ని ఇస్లామిక్‌ దేశాల్లో మహిళా వస్త్రధారణ పై ఆంక్షలు విధించడం సాధారణం. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కూడా కో ఎడ్యుకేషన్‌ నిషేధిస్తూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. తాజాగా పాకిస్తాన్‌ కూడా అదే తరహలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది. 

ఈ క్రమంలో పాకిస్తాన్‌ ఫెడరల్‌ డైరక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఎఫ్‌డీఈ) మహిళా ఉపాధ్యాయులను టైట్స్‌, జీన్స్‌ ,పురుష ఉపాధ్యాయులను జీన్స్‌, టీ షర్ట్స్‌ ధరించకూడదంటూ  ఆంక్షలు జారీ చేసింది.  అంతేకాదు మహిళలు/పురుష ఉపాధ్యాయులు ఎలాంటి దుస్తులు ధరించాలో ఎఫ్‌డీఈ నిర్ణయించింది. పాకిస్తాన్‌లో అన్ని విద్యాసంస్థలలోని బోధన/బోధనేతర సిబ్బంది వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తాము సూచించిన  నియమాలను పాటించేలా చూడాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు