Pakistan: దైవాన్ని దూషించిందని మహిళా ప్రిన్సిపాల్‌కు మరణ శిక్ష

29 Sep, 2021 11:33 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ప్రవక్త ముహమ్మద్ తర్వాత తదుపరి ప్రవక్త తానేనని ప్రకటించుకున్నందుకు పాకిస్తాన్‌లో ఓ మహిళకు మరణశిక్ష విధించారు.ఈ కేసులో.. ఆ మహిళ దైవదూషణకు పాల్పడినట్లు విచారణలో తేలిందని అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి మన్సూర్ అహ్మద్ తుది తీర్పుని వెలువడించారు. వివరాల్లోకి వెళితే.. నిష్టార్ కాలనీలోని ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ సల్మా తన్వీర్‌ ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్ కాదనేలా తానే తదుపరి ప్రవక్తనంటూ ప్రకటించుకుంది.

దీంతో స్థానిక మతాధికారి ఫిర్యాదుపై లాహోర్ పోలీసులు 2013లో తన్వీర్‌పై దైవదూషణ కేసు నమోదు చేశారు. దీనిపై ఆమె తరఫు న్యాయవాది ముహమ్మద్ రంజాన్ తన క్లయింట్‌కు మతి స్థిమితం లేదని కోర్టు ఆ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. అయితే, ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, మెడికల్ బోర్డ్ నివేదికలో.. ఆమె మానసిక స్థితిపరంగా బాగానే ఉందని తెలిపింది.

దీంతో ఆమె చేసిన ప్రకటన దైవదూషణగా పరిగణిస్తూ తన్వీర్‌కు కోర్టు ఉరి శిక్ష విధించింది. దాంటోపాటు రూ.5 వేలు (పాకిస్తాన్‌ కరెన్సీలో) జరిమానా కూడా విధించింది. పాకిస్తాన్‌లో వివాదాస్పద దైవదూషణ చట్టాలు వాటికి నిర్దేశించిన శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. 1987 నుంచి అక్కడ దైవదూషణ చట్టం కింద కనీసం 1,472 మందిపై కేసులు నమోదయ్యాయి.

చదవండి: China: డ్రాగన్‌ దుశ్చర్య.. 55 గుర్రాలపై వందమంది చైనా సైనికులు

మరిన్ని వార్తలు