వెలుగులోకి మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో.. పోలీసులకు ఫిర్యాదు

20 Nov, 2021 08:14 IST|Sakshi

పాకిస్తాన్‌లో వెలుగు చూసిన సంఘటన

నిందితుడుని అరెస్ట్‌ చేసిన పోలీసులు

కొనసాగుతున్న దర్యాప్తు

Saniya Aashiq Viral Video, ఇస్లామాబాద్‌: సాంకేతికత పెరిగిన ప్రస్తుత కాలంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సైబర్‌ క్రైమ్‌ బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్‌ మహిళా ఎమ్మెల్యే చేరారు. సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో దీని మీద సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు.. 

పాకిస్తాన్‌ పంజాబ్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యేకు చెందిన అశ్లీల వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ క్రమంలో ఆమె దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కంప్లైంట్‌ మేరకు పోలీసులు ఈ కేసులో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో గురించి సానియాకు అక్టోబర్‌లో తెలిసిందని.. దీని గురించి ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిందని పాక్‌ మీడియా వెల్లడించింది. 
(చదవండి: రేపిస్టులకు ఇక చుక్కలే.. కఠిన శిక్ష అమలుకు పార్లమెంట్‌ ఆమోదం)

అక్టోబర్‌ 26న సానియా ఫెడరల్‌ దర్యాప్తు సంస్థకు ఈ అశ్లీల వీడియో గురించి ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ఓ అశ్లీల వీడియోలో తాను కనిపిస్తున్నానని... ఎవరో కావాలనే తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు వీడియోలో తనని మార్ఫ్‌ చేశారని తెలిపారు. వీడియో చూసిన సోషల్‌ మీడియా యూజర్లు.. దానిలో ఉన్నది ఎమ్మెల్యే సానియానే అని తెలిపారు. కానీ ఈ వార్తలని ఆమె ఖండించింది. 
(చదవండి: అఫ్గాన్‌లో పాకిస్తాన్‌ విధ్వంసకర పాత్ర)

సానియా ఫిర్యాదు తర్వాత మూడు వారాల దర్యాప్తు అనంతరం పోలీసులు ఇందుకు బాధ్యుడైన ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. కానీ అతడి వివరాలు బయటకు వెల్లడించలేదు. అంతేకాక వీడియోలో నటించిన స్త్రీ సానియానా లేక వేరే మహిళా అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు మీడియా కథనాల ప్రకారం వీడియో ప్రత్యక్షం అయిన నాటి నుంచి సానియాకు అసభ్య ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని తెలిసింది. సానియా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియంకు స్నేహితురాలు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆమె పలు అంశాలపై పని చేస్తున్నారు. 

చదవండి: ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!

మరిన్ని వార్తలు