11 ఏళ్ల పాకిస్తాన్‌ మైనర్‌ బాలుడి పై అత్యాచారం, హత్య

21 Nov, 2021 08:16 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 11 ఏళ్ల హిందూ బాలుడుని లైంగిక వేధింపులకు గురిచేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాదు ఆ బాలుడు శవమై ప్రావిన్స్‌లో ఖైర్‌పూర్ మీర్ ప్రాంతంలోని బబర్లోయ్ పట్టణంలోని ఒక పాడుబడిన ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించింది. ఈ మేరకు ఆ బాలుడు బంధువు రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ..."మా కుటుంబం  గురునానక్ పుట్టినరోజు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మా పిల్లవాడు ఎప్పుడూ అదృశ్యమయ్యాడో మేము గుర్తించలేకపోయాం." అని చెప్పారు.  

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!)

అంతేకాదు ఆ బాలుడు 2011లో జన్మించాడని, ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్నట్లు  ఆ బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా ఆ మైనర్‌ బాలుడి శరీరంపై చిత్రహింసల తాలుకా గుర్తులు కూడా ఉన్నాయని చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీ సుక్కుర్‌కు చెందిన జుబైర్ మహర్ తెలిపారు. అంతేకాదు గత కొన్ని వారాల్లో ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని మహర్‌​ చెబుతున్నారు. ఈ మేరకు బాబర్లోయి పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) మాట్లాడుతూ.." నిందితులు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడే ముందు బాలుడిని గొంతు కోసి చంపినట్లు చెప్పారు. మేము ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. పైగా వారిలో ఒకరు నేరాన్ని అంగీకరించారు" అని ఎస్‌హెచ్‌ఓ చెప్పారు.

(చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..)

మరిన్ని వార్తలు