అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్‌’..ఎందుకో తెలుసా?

6 Dec, 2021 14:04 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఇటీవలకాలంలో తమ పిల్లల పేర్లు విభిన్నంగా ఉండాలని, పైగా ఆ పేరు ఎవ్వరికి ఉండకూడదని విన్నూతనంగా పెడుతుండటం చూశాం. కానీ ఇక్కడొక జంట తాము భారత్‌ పాక్‌ సరిహద్దుల్లో చిక్కుకుపోవడంతో అప్పుడే పుట్టిన తమ బిడ్డకు సరిహద్దు(బోర్డర్‌) అని పేరుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

(చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!)

అసలు విషయంలోకెళ్లితే....ఓ పాకిస్తానీ దంపతులు తమకు పుట్టిన మగబిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టారు. అయితే ఆ జంట 97 మంది పాకిస్తానీ పౌరులతో సహా 71 రోజులుగా అట్టారీ సరిహద్దులో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఆ పాకిస్తానీ జంట పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబు బాయి, బాలం రామ్‌లు. ఈ క్రమంలో బాలం రామ్‌ మాట్లాడుతూ...ఇండో-పాక్ సరిహద్దులో పుట్టినందున మా బాబుకి ఆ పేరు పెట్టాం. నా భార్య నింబు బాయి ఈ నెల డిసెంబర్ 2 న ప్రసవం అయ్యిందని, అంతేకాక తన భార్యకు సాయం చేయడానికి పొరుగున ఉన్న పంజాబ్ గ్రామాల నుండి కొంతమంది మహిళలు రావడమే కాక  వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.

అయితే నేను లాక్‌డౌన్‌కు ముందు తమ బంధువులను కలవడమే కాకుండా తీర్థయాత్ర కోసం భారత్‌కు వచ్చాను. అయితే నా వద్ద తిరిగి వెళ్లేందకు అవసరమ్యే పత్రాలు లేకపోవడంతో ఇతర పాకిస్తానీ పౌరులతో కలిపి సుమారు 98 మందితో సహా ఈ సరిహద్దులో చిక్కుకుపోయాం" అని చెప్పాడు. దీంతో ఈ కుటుంబాలు అట్టారి అంతర్జాతీయ చెక్‌పోస్టు సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉండిపోయారు. అయితే వారికి స్థానికులు మూడు పూటల భోజనం, మందులు, దుస్తులు అందిస్తున్నారు.

(చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!)

మరిన్ని వార్తలు