పెళ్లి కానుకగా ఏకే 47 రైఫిల్‌

28 Nov, 2020 18:52 IST|Sakshi

ఇస్లామాబాద్‌: సాధారణంగా పెళ్లిలో ఇచ్చే బహుమతలు అంటే విలువైన ఆభరణాలు, డబ్బులు, హనీమూన్‌ ట్రిప్‌ టికెట్లు, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులు, అలంకరణ సామాగ్రి వంటివి ఉంటాయి. వెరైటీ గిఫ్ట్‌లు ఇచ్చే వారు కూడా ఉంటారు. కానీ మరణాయుధాలను బహుమతులుగా ఇవ్వడం గురించి ఇంతరకు చూడలేదు.. వినలేదు కదా. అయితే ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోది. పెళ్లిలో ఓ మహిళ వరుడికి ఏకే 47 రైఫిల్‌ని బహుమతిగా ఇచ్చింది. దీనికే ఆశ్చర్యంగా ఉంటే.. అది చూసి అక్కడ ఉన్న వారంతా సంతోషంతో చప్పట్లు కొట్టడం కొసమెరుపు. ఇంతకు ఈ వింత సంఘటన ఎక్కడ జరిగింది అంటే దాయాది దేశం పాకిస్తాన్‌లో. (మా ఆయనకు వధువు కావాలి: భార్యలు )

వివరాలు.. వీడియోలో ఓ మహిళ నూతన వధువరూలను ఆశీర్వదించిన అనంతరం.. తాను తీసుకొచ్చిన బహుమతిని వరుడికి ఇవ్వాల్సిందిగా పక్కనున్న వారిని కోరుతుంది. దాంతో వారు ఆమె తెచ్చిన ఏకే 47 రైఫిల్‌ని అతడికి అందిస్తారు. అది చూసి అక్కడున్నవారంతా చప్పట్లతో వారిని అభినందిస్తారు. ఇక ఏఆర్‌వై న్యూస్‌ ప్రకారం పాకిస్తాన్‌లో ‘కలాష్నికోవ్’ అనే సంప్రాదాయం ప్రకారం అత్తగారు.. అల్లుడికి ఇలా ఏకే 47 రైఫిల్‌ని బహుకరిస్తుంది అని తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు తమకు పెళ్లి సమయంలో వచ్చిన బహుమతులను గుర్తు చేసుకుంటూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘రైఫిల్‌ చూసి పెళ్లి కొడుకు ఏ మాత్రం ఆశ్చర్యం పోలేదు. అంటే ఇది అక్కడ కామన్‌ ఏమో’.. ‘ఈ బహుమతిని అమ్మాయికి ఇస్తే బాగుండేది.. అలా అయినా అత్తింటి వారు ఆమెను జాగ్రత్తగా చూసుకునేవారు’.. ‘బహుమతి తీసుకున్నావ్‌ బాగానే ఉంది కానీ.. పరీక్షించాలని మాత్రం చూడకు నాయనా’ అంటూన్నారు నెటిజనులు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా