బలిచ్చే ముందు చివరి వీడియో.. గేదెతో స్పెషల్ ఇంటర్వ్యూ..

22 Jul, 2021 08:47 IST|Sakshi
వీడియో దృశ్యాలు

లాహోర్‌ : విలక్షణ పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ అమిన్‌ హఫీజ్‌ మరోసారి తన మార్కును చూపించుకున్నారు. గతంతో ఆయన గాడిద మీద కూర్చుని, రాజు వేషంలో ఇలా పలు రకాలుగా ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే. లోగడ ఆయన గేదెలను ఇంటర్వ్యూ చేసినప్పటికి.. ఈ సారి బక్రిద్‌ సందర్భంగా ఓ గేదెను స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశారు. దాన్ని ప్రశ్నలు అడగటమే కాదు.. జవాబులు కూడా రాబట్టుకున్నారు. బుధవారం బక్రిద్‌ రోజున లాహోర్‌లోని గేదెలను బలిచ్చే చోటుకు ఆయన వెళ్లారు. 
అక్కడ ఉన్న ఓ గేదె దగ్గర నిలబడి.. ‘‘ బలివ్వటానికా?..’’ అని అక్కడ ఉన్న మనిషిని అడిగాడు. అవునని సమాధానం వస్తుంది. 

అమిన్‌ హఫీజ్‌ : హా!! చెప్పండి! లాహోర్‌కు వచ్చారు కదా.. మీకెలా అనిపిస్తోంది. ( దాని తలపై నిమిరి) లాహోర్‌ ఎలా అనిపిస్తోంది?.
గేదె : ఉవావా.... 
 అమిన్‌ హఫీజ్‌ : లాహోర్‌ బాగుందంట.. (అని ఆ వెంటనే) చెప్పండి! లాహోర్‌ తిండి బాగుందా?.. మీ ఊరు తిండి బాగుందా?
( సమాధానం రాకపోవటంతో దాని తల నిమురుతూ మరో సారి )చెప్పండి! లాహోర్‌ తిండి బాగుందా?.. మీ ఊరు తిండి బాగుందా?
గేదె : ఉవావా.... 
 అమిన్‌ హఫీజ్‌ : హా!! లాహోర్‌ తిండి బాగుందంట.. 
 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన 28 సెకన్ల నిడివి కలిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు