లైవ్‌లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్‌.. ఎట్టకేలకు ఆమె స్పందన

12 Jul, 2022 14:44 IST|Sakshi

వైరల్‌: లైవ్‌లో యాంకర్లు, జర్నలిస్టుల వీడియోలు తరచూ వైరల్‌ అవుతున్నవే. అలాంటిది ఈ వీడియో. లైవ్‌లోనే ఓ కుర్రాడి దవడ పగలకొట్టింది రిపోర్టర్‌. దీంతో ఆమెను సపోర్ట్‌ చేసేవాళ్లు కొందరైతే.. మరికొందరు తిట్టిపోస్తున్నారు.

చుట్టూ జనం మూగి ఉన్న టైంలో.. ఆమె అక్కడ రిపోర్టింగ్‌ చేస్తూ కనిపించింది. అయితే.. ఉన్నట్లుండి ఒక్కసారిగా అసహనంతో ఆమె పక్కనే ఉన్న కుర్రాడి చెంప పగలకొట్టింది. బహుశా విసిగించినందుకే ఆమె అలా చేసి ఉంటుందని భావిస్తున్నారు చాలామంది. వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వ్యక్తి కూడా ఆమె ఎందుకలా చేసిందో కారణం చెప్పలేదు.

బహుశా ఆ కుర్రాడు అసభ్యంగానో, అభ్యంతరకరంగానో ప్రవర్తించి ఉంటాడని.. అందుకనే అలా శిక్షించి ఉంటుందని మద్దతు ప్రకటిస్తున్నారు కొందరు. పాకిస్థాన్‌లో ఈద్‌ అల్‌ అదా వేడుకల సందర్భంగా రిపోర్టింగ్‌ చేస్తున్న టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

మైరా హష్మీ వివరణ

ఆ వీడియోలో ఉన్న జర్నలిస్ట్‌ పేరు మైరా హష్మీ. సోషల్‌ మీడియాలో ఆమె వీడియో ట్రోల్‌ అవుతుండడంతో స్పందించింది. ఇంటర్వ్యూ టైంలో ఆ కుర్రాడు పక్కనే ఉన్న కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఇది వాళ్లను ఇబ్బందికి గురి చేసింది. అలా చేయొద్దని మొదట మంచిగా చెప్పాను. కానీ, సౌండ్‌ చేస్తూ మరింత రెచ్చిపోయాడు. సహించాలా? అతనికి మళ్లీ అవకాశం ఇవ్వాలా? అనిపించింది. అందుకే అలా చేశా అని ఆమె ట్విటర్‌లో వివరణ ఇచ్చుకుంది. అయితే విషయం ఏదైనా సరే అలా పబ్లిక్‌పై చెయ్యి చేసుకునే హక్కు ఆమె ఎక్కడిదని? పలువురు నెటిజన్స్‌ నిలదీస్తున్నారు.

మరిన్ని వార్తలు