నా కొడుకు వస్తే సర్వనాశనమే: ట్రంప్‌ తల్లి

9 Jan, 2021 17:04 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు మూటగట్టుకోనంత అపఖ్యాతిని డొనాల్డ్‌ ట్రంప్‌ మూటగట్టుకున్నారు. ఆయన చేష్టలు, నిర్ణయాలతో విమర్శల పాలయ్యారు. ఇక తాజాగా అధ్యక్ష ఎన్నికల ఓటమి తర్వాత ట్రంప్‌ తీరు మరి దారుణంగా తయారయ్యింది. ఇక క్యాపిటల్‌ హిల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడితో ఆయన ప్రతిష్ట మరింత దిగజారింది. ట్రంప్‌ వైఖరిని అన్ని దేశాల అధినేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సంబంధించిన ఓ పాత వార్త క్లిప్పింగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వారు ట్రంప్‌ గురించి ఆయన తల్లి సరిగ్గా అంచనా వేశారు.. ఆమె జోస్యం నిజమయ్యింది అంటున్నారు.

ఇంతకు ఆ పేపర్‌ క్లిప్పింగ్‌లో ఏం ఉంది అంటే ట్రంప్‌ని ఉద్దేశించి ఆయన తల్లి మేరీ అన్నే మాక్లియోడ్ ట్రంప్ ‘నా కుమారుడు ఓ ఇడియట్‌.. ఒప్పుకుంటాను. తనకు కామన్‌సెన్స్‌ శూన్యం. సామాజిక అంశాలు, బాధ్యత అస్సలే తెలియదు. కానీ తను నా కుమారుడు. తను రాజకీయాల్లోకి రాడని నా విశ్వాసం. ఒకవేళ అదే నిజమయ్యి.. తను పాలిటిక్స్‌లోకి వస్తే ఇక సర్వనాశనమే’ అని ఉన్న ఈ పేపర్‌ క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ‘బిడ్డ గురించి తల్లికే బాగా తెలుస్తుంది.. ట్రంప్‌ గురించి ఎంత బాగా అంచనా వేశారో’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: త్వరలోనే బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: ట్రంప్‌)
 

ఆ క్లిప్పింగ్‌ ఫేక్‌: రాయిటర్స్‌
అయితే ఈ పేపర్‌ క్లిప్పింగ్‌ గతేడాది ఏప్రిల్‌లో తొలిసారి సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో రాయిటర్స్‌ ఇది నిజమా, కాదా తెలుసుకునే ప్రయత్నం చేసింది. చివరకు ఈ పేపర్‌ క్లిప్పింగ్‌ ఫేక్‌ అని.. ట్రంప్‌ గురించి అతడి తల్లి అన్నే మేరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడా రికార్డవ్వ లేదని వెల్లడించింది. ఈ ఫోటోపై కనీసం తేదీ, మూలాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫేక్‌ అనే స్పష్టం చేసింది. ఈ క్లిప్పింగ్‌ ఫేక్‌ అయినప్పటికి ట్రంప్‌ మాత్రం అమెరికా ప్రతిష్టని సర్వనాశనం చేశాడని నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు