వీడియో: ప్రైవేట్‌ పార్టీలో ఫిన్లాండ్‌ ప్రధాని రచ్చ.. డ్రగ్స్‌ టెస్టులో సన్నా మారిన్‌కు భారీ ఊరట

23 Aug, 2022 07:27 IST|Sakshi

హెల్సెంకీ: ఫిన్లాండ్‌ ప్రధాన మంత్రి సన్నా మారిన్‌(36)కు భారీ ఊరట కలిగింది. స్నేహితులతో పార్టీ చేసుకున్న ఆమె.. డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తన నిజాయితీ నిరూపించుకునేందుకు ఆమె డ్రగ్స్‌ టెస్ట్‌లకు సిద్ధమయ్యారు. 

ఆగస్టు 19న ఆమె నుంచి యూరిన్‌ శాంపిల్స్‌ సేకరించారు అధికారులు. అయితే డ్రగ్స్‌ టెస్టుల్లో ఆమె ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని తేలిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మద్యం మాత్రం సేవించినట్లు స్వయంగా మారిన్‌ ఇదివరకే వెల్లడించడం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్న ఆమె వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ పార్టీలో డ్రగ్స్‌ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. స్వచ్ఛందంగా డ్రగ్స్‌ టెస్టులకు ముందుకు రావాలని ఆమెను డిమాండ్‌ చేశాయి. 2019లో 34 ఏళ్ల వయసులో సన్నా మారిన్‌ ఫిన్లాండ్‌కు ప్రధానిగా ఎన్నికయ్యారు. గతంలోనూ అధికారిక భవనంలో పార్టీలు చేసుకుని ఆమె విమర్శలపాలయ్యారు కూడా.

ఇదీ చదవండి: ఎట్టకేలకు.. శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక

మరిన్ని వార్తలు