విమానం ఎగిరాక కిందకు దింపమని రచ్చ.. ప్యాసెంజర్ ప్రవర్తనకు అందరూ షాక్..

19 Sep, 2022 18:49 IST|Sakshi

విమానం టేకాఫ్ అయ్యాక తనను కిందకు దింపమని రచ్చ రచ్చ చేశాడు ఓ ప్రయాణికుడు. బట్టలు విప్పేసుకుని హల్‍చల్ చేశాడు. విమానం కిటికీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సీట్లను పదే పదే తన్నాడు. ఆపేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా దాడి చేశాడు. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో గతవారం ఈ ఘటన జరిగింది.

సెప్టెంబర్ 14న పెషవార్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న పీకే-283 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే  ఓ ప్యాసెంజర్ విచిత్రంగా ప్రవర్తించసాగాడు. విమానంలో ప్రయాణికులు నడిచే ఫ్లోర్‌పై బోర్లా పడుకుని ప్రార్థనలు చేయాలని ఇతరులకు సూచించాడు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా ఊరుకోలేదు. వారితో దురుసుగా ప్రవర్తించి బెంబేలెత్తించాడు.

ప్రయాణికుడి చేష‍్టలకు విసిగిపోయిన సిబ్బంది నిబంధనల ప్రకారం అతడ్ని సీటుకు కట్టేశారు. అతడు మరోసారి విమానం ఎక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. ప్యాసెంజర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికుడు ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.

చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు.. ప్రపంచదేశాల అధినేతలు హాజరు

మరిన్ని వార్తలు